యూనిట్

అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులను స్మరించుకుంటూ కృష్ణా జిల్లా ఎస్‌.పి. రవీంద్రనాథ్‌బాబు ఆధ్వర్యంలో జిల్లా అంతటా వారోత్సవాలు నిర్వహించారు. అమరుల త్యాగాలను ప్రజలకు గుర్తుచేస్తూ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఓపెన్‌ హౌస్‌లు, రక్తదాన శిబిరాలు, స్వచ్ఛభారత్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మెగా వైద్యశిబిరాలు నిర్వహించారు. బాధిత కుటుంబాలతో సమావేశాలు నిర్వహించారు. సంస్మరణ దినోత్సవం రోజున అతిథిగా వచ్చేసిన పేర్ని వెంకట్రామయ్య నాని, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ అర్జునుడు, ఎస్‌.పి. తదితరులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

వార్తావాహిని