యూనిట్

లైవ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 'స్పందన' నిర్వహణ

ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్‌ స్పందన కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్‌ ఆఫీస్‌లు, సబ్‌డివిజనల్‌ స్థాయి అధికారులు నిర్వహించిన స్పందన కార్యక్రమాన్ని లైవ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ మరియు పేస్‌ బుక్‌ లైవ్‌ ద్వారా జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. బాధితుల విన్నపాలను ఎస్పీ వీక్షించి వెంటనే తీసుకోవల్సిన చర్యలను ఆయా సంబంధిత అధికారులకు సూచనలు అందించారు. స్పందన కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వీడియో కాన్ఫరెన్స్‌ మరియు పేస్‌ బుక్‌ లైవ్‌ ద్వారా ప్రకాశం జిల్లాలో నిర్వహించారు. ప్రకాశం పోలీస్‌ ఫేస్‌ బుక్‌ పేజిలో ప్రత్యక్ష ప్రసారం అయ్యేవిధంగా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుకు అకౌంట్‌బులిటీ వుండేలా చూస్తూ రశీదులను ఇస్తూ తగిన పరిష్కారాలు జరిగే విధంగా చూస్తున్నాం. స్పందన కార్యక్రమాన్ని పేస్‌బుక్‌ లైవ్‌లో చూసిన గంటూరు రేంజ్‌ ఐజి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ జిల్లా ఎస్పీని అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.మహేంద్ర పాత్రుడు, ఎస్బీ సి.ఐలు ఎన్‌.శ్రీకాంత బాబు, వై.శ్రీనివాసరావు, ఎస్సై షేక్‌ నాయబ్‌ రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని