యూనిట్
Flash News
కానిస్టేబుల్ కుటుంబానికి తోటి బ్యాచ్ పీసీల చేయూత

కర్నూలు జిల్లా పోలీసుశాఖలో 2011 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ జి.శ్రీనివాసులు (పిసి 2070) మాధవరం పీఎస్‌లో పనిచేస్తూ ఇటీవల గుండెపోటుతో మతి చెందారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు తోటి బ్యాచ్ కానిస్టేబుళ్ళు తమ వంతు సహాయంగా సేకరించిన మొత్తం 90 వేల నగదు, కుమార్తె వైష్ణవి (7) పేరు మీద 3 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి చేతుల మీదుగా కానిస్టేబుల్ శ్రీనివాసులు సతీమణి శ్రీమతి పద్మమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సంఘం అధ్యక్షులు నాగారాజు, సంఘం సభ్యులు వాసు, తోటి బ్యాచ్ కానిస్టేబుళ్ళు జి.మల్లికార్జున, షేక్ షావలి, మల్లేశ్, రమేష్ దామోదర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.