యూనిట్
Flash News
స్పందన లక్ష్యాన్ని సాకారం చేద్దాం
ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సేవలు ప్రతి ఒక్కరికి సమర్థవంతంగా చేరాలన్న మంచి ఉద్దేశ్యంతో స్పందన కార్యక్రమాన్ని ఆరంభించారని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు శ్రీ అజేయ కల్లాం చెప్పారు. అందుచేత ప్రతి శాఖలోని అధికారులు, సిబ్బంది నిబద్దత, అంకితభావంతో విధులు నిర్వర్తించి 'స్పందన' సంపూర్ణ లక్ష్య సాధనకు తోడ్పడాలని ఆకాంక్షించారు. గుంటూరు రేంజ్ స్పందన వర్క్‌షాప్‌ను ఒంగోలు ఏ1 కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రెవెన్యూ,పోలీస్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్న ఈ వర్క్‌షాప్ నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్పందనలో వచ్చే ప్రతి ఫిర్యాదుపైన ప్రత్యేక శ్రద్ద వహించి పరిష్కరించాలని, ఇది ప్రభుత్వ పాలనా విధానాన్ని ప్రతిబింబించే కార్యక్రమమని ఆయన అన్నారు. రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ గారు మాట్లాడుతూ పాలనలో గుణాత్మక మార్పు తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి రూపకల్పన చేసిందని, స్పందన అమలులో ఎదురవుతున్న అవరోధాలను ఏ విధంగా అధిగమించాలో వర్క్ షాప్ ద్వారా అవగాహన చేసుకొని ముందుకుసాగాలని చెప్పారు. మన సంస్క తిలో మహిళలు పోలీసు స్టేషన్‌కు రావడాన్ని నామోషిగా భావిస్తారని, అటువంటిది స్పందనకు వచ్చే ఫిర్యాదు దారుల్లో 52 శాతం మహిళలే ఉంటుండడం గమనార్హం అన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజా సన్నిహితంగా చేపడుతున్న విధానాలతో మహిళలు తమ సమస్యలను చెప్పుకోడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ విభాగంలో ఎక్కడ సమస్య ఉన్నప్పటికీ అది పోలీసులు ద్వారా పరిష్కారం అవుతాయని చాలామంది వస్తున్నారని, మానవతా దక్పథంతో మనం అందించే సేవలే ప్రభుత్వ తీరుకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, వాటికి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చూడడం మనందరి సమిష్టి భాద్యత అన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మిళితం చేసి స్పందన కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కేవలం ఒక్కో సెంటర్‌కు రూ. 2,100 వ్యయంతో అన్ని పోలీస్‌స్టేషన్లు, సిఐ, ఎస్‌డిపిఓ కార్యాలయాలలోను వీడియో కాన్ఫరెన్స్ సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసి జిల్లా కార్యాలయంతో అనుసంధానం చేయడం ద్వారా స్పందన పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. అదే విధంగా సోషల్ మీడియా ద్వారా కూడా విస్తత ప్రాచుర్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్ రెడ్డిగారు సూచించిన విధంగా రెస్పాన్స్‌బిలిటి, అకౌంట్‌బిలిటికి కట్టుబడుతున్నమన్నారు. అన్ని చోట్ల రిసెప్షన్, రిసిప్ట్ విధానాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా పోలిస్ శాఖ అమలుపరుస్తున్న స్పందన కార్యక్రమ విధానాన్ని పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. ఈ విధానాన్ని రూపకల్పన చేయడంలో ఎస్‌బి సిఐ ఎన్.శ్రీకాంత్ బాబు, ఐటి కోర్ ఎస్.ఐ. నాయబ్ రసూల్ మరియు ఐటి కోర్ టీం విశేషంగా కషి చేసిందని తెలిపారు. స్పందనను సాంకేతికతతో అత్యున్నతంగా అమలుచేస్తున్నందుకు ముఖ్యమంత్రి ముఖ్యసలహదారు శ్రీ అజేయ్‌కల్లం ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌ను అభినందించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ అరుణ్ బాబు, సెర్ప్ సిఈఓ రాజాబాబులు స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో అవలంభించాల్సిన విధానాలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఆరోఖ్య రాజ్, సమన్వయకర్త జీవన్, కలెక్టర్లు పోలా భాస్కర్, ఎం.వి శేషగిరిబాబు, సామ్యేల్ ఆనంద్ కుమార్, గుంటూరు ఐజి వినీత్ బ్రిజ్ లాల్, ఎస్పీలు ఐశ్వర్య రస్తోగి, రామకష్ణ, విజయరావు తదితరులు పాల్గొన్నారు