యూనిట్

అసెంబ్లీ ముట్టడిని కట్టడి చేద్దాం - గుంటూరు అర్భన్ ఎస్పీ రామకృష్ణ

                           

రేపటి రోజు అనగా 20-01-20  వ తేదీన అమరావతి JAC ఆధ్వర్యంలోని అసెంబ్లీ ముట్టడి   కార్యక్రమానికి పిలుపు ఇచ్చినందున, శాసనసభ / శాసనమండలి సమావేశములు జరుగనున్నందున  మరియు గుంటూరు  అర్బన్ పరిధిలో సెక్షన్ 30 పోలీసు యాక్టు , సెక్షన్ 144 సిఆర్.పి.సి  క్రింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున ఎలాంటి ముట్టడి కార్యక్రమాలకు అనుమతులు లేవని  గుంటూరు అర్భన్ ఎస్పీ రామకృష్ణ తెలియజేసారు.

అసెంబ్లీ ముట్టడి పిలుపు సందర్భంగా ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసి వారందరికి బ్రీఫింగ్ కార్యక్రమాలను కేశవరెడ్డి స్కూల్ మరియు పోలీసు కవాతు మైదానంలో ఈరోజు అనగా 19-01-2020 న అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి రామకృష్ణ  నిర్వహించినారు.

 

 చెక్ పోస్ట్స్, పిక్ అప్ పార్టీస్,   రూట్ మొబైల్స్, పెట్రోలింగ్ పార్టీస్పుట్ పెట్రోలింగ్ పార్టీస్ , స్ట్రైకింగ్ ఫోర్స్ , స్పెషల్  స్ట్రైకింగ్ ఫోర్స్, సేర్వేలెన్సు టీమ్స్ రోప్ పార్టీస్, రూట్ బందోబస్తు , సెక్యురిటి కంపోనెంట్ , మొదలైన విభాగాలలో పక్కా ప్రణాళికా బద్దముగా గుంటూరు అర్బన్ పరిధిలో తగిన విధంగా పోలీసు సిబ్బంది మరియు అధికారులను నియమించడం జరిగిందని, ఎస్పీ తెలియ జేసినారు.

 

  ముట్టడి మొదలైనటువంటి  అనుమతిలేని కార్యక్రమము లకు ఎవ్వరూ హాజరు కావద్దని,

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండుటకు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి, ప్రభుత్వ అధికారులకు సహక రించవలసినదిగా  ప్రజలందరికీ ఎస్పీ  విజ్ఞప్తి  చేసినారు.

 

చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి సిబ్బంది ద్వారా వాహనాలను / వ్యక్తులను తనిఖీ చేసిన అనంతరమే అనుమతించ బడతారని, ఆందోళనకారులు ఎవరైనా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడినా , ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చర్యలు చేసినా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదుచేసి, చట్ట బద్ధమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

 

ఈ బందోబస్తు సందర్భంగా డ్రోన్ కెమెరాలను, బాడీవర్న్ కెమెరాలనువీడియోకెమెరా లను ఉపయోగించడం జరుగుతుందనిఎవరైనా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడిన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించు కోలేరని తెలిపారు.

 

అనంతరము బందోబస్తుకు నియమించబడ్డ వారిలో ఎస్సై నుండి డీఎస్పీ స్థాయి అధికారులతో అర్బన్ కాన్ఫరెన్స్ హెల్ నందు సమావేశం నిర్వహించారు. బందోబస్తు విధులలో సిబ్బంది / అధికారులు ఆందోళన చేసేవారితో స్నేహపూర్వకంగా / గౌరవ మర్యాదలతో వ్యవహ రించాలని, అదే సమయంలో చట్టం నిర్దేశించిన మేరకు నిక్కచ్చిగా వ్యవహరించాలని ఎస్పీ గారు తెలియజేసినారు.

వార్తావాహిని