యూనిట్
Flash News
జోగినీ వ్యవస్థను సమిష్టిగా రూపుమాపుదాం

జోగినీ వ్యవస్థను సమిష్టిగా రూపుమాపుదాం జోగినీ వ్యవస్థను రూపుమాపడానికి అన్ని వర్గాలు కలిసికట్టుగా పనిచేద్దామని అనంతపురం జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు పిలుపు నిచ్చారు. ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణం సమీపంలోని మద్ధాన్నేశ్వర కళ్యాణ మండపంలో జోగినీ వ్యవస్థ నిర్మూలన - చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... భిన్న సంస్కతుల కలయికైన మనదేశంలో స్త్రీలను ఉన్నతంగా గౌరవిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మగవాళ్ళకి సమానంగా మహిళలు అన్నిరంగాల్లో అభివద్ధి చెందుతుండటం శుభ పరిణామ మన్నారు. ఇదంతా ఒకెత్తయితే ...మరోవైపు అక్కడక్కడ గ్రామాల్లో ఆచారాల పేరుతో అమాయక స్త్రీలను దారుణంగా దోచుకుంటున్నదీ ఈ జోగిని వ్యవస్థ అన్నారు. జోగినీలుగా మార్చేందుకు ఎవరైనా బలవం తపెట్టిన, ఆంక్షలు పెట్టినా లేదా ఇతర సమస్యలుంటే సంబంధిత పోలీసుల దష్టికి తీసుకెళ్లడం లేదా డయల్-100 కు సమాచారం చేరవేయాలన్నారు. ఈకార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీ కాపు రామచంద్రారెడ్డి, అదనపు ఎస్పీ శ్రీమతి కె.చౌడేశ్వరి, ఐ.సి.డి.ఎస్ అధికారులు, డీఎస్పీ వెంకటరమణ, సి.ఐలు రియాజ్ అహ్మద్, రాజా, ఎస్సీ విభాగం నాయకులు చామలూరు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.