యూనిట్

పరేడ్‌ గ్రౌండ్‌లో నూతనంగా నిర్మించిన డయాస్‌ ప్రారంభం

నెల్లూరు జిల్లా పోలీసు కవాతు మైదానంలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన డయాస్‌ను జిల్లా ఎస్‌.పి. ఐశ్వర్య రస్తోగి ప్రారంభించారు. అనంతరం ఎస్‌.పి. పుల్‌ డ్రెస్‌ కవాతు రిహార్సిల్స్‌ను పరిశీలించి పరేడ్‌ సిబ్బందిని అభినందించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాగ్‌ స్క్వాడ్‌ వివిధ అంశాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా ఎస్‌.పి. గారు మాట్లాడుతూ పోలీసు కవాతు మైదానానికి ఫోర్ట్‌ వాల్‌ మరియు నూతనంగా నిర్మించిన డయాస్‌ మంచి శోభను తెచ్చిపెడుతున్నాయని అన్నారు. డయాస్‌ను అత్యంత తక్కువ సమయంలో నిర్మించి అతి సుందరంగా తీర్చిదిద్దిన కన్స్ట్రక్షన్‌ ఇంజినీర్‌, సూపర్‌ వైసర్‌, తాపి మేస్త్రి, సిబ్బందిని ఎస్‌.పి. అభినందించినారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.పి. వీరభద్రుడు, డీఎస్‌పీలు ఎన్‌.కోటరెడ్డి, జె.శ్రీనివాసులు రెడ్డి, కె.వి.రాఘవ రెడ్డి, మల్లికార్జున, మరియదాసు,లక్ష్మి నారాయణ, రవీంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని