యూనిట్
Flash News
ఆర్‌టిసి కాంప్లెక్స్‌లో పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభం

శ్రీకాకుళం
పట్టణ ఆర్‌టిసి కాంప్లెక్స్‌లో పోలీస్ అవుట్ పోస్ట్‌ను జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి
ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లతో షిప్టులు వారీగా
విధులు నిర్వహిస్తారని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, బయటప్రాంతాల
నుంచి వచ్చే ప్రయాణికులపై దష్టిసారించడం, రాత్రివేళల్లో
ఒంటరిగా ఉండే మహిళలకు రక్షణ కల్పించడం, దొంగతనాలకు
పాల్పడే వ్యక్తులను పట్టుకోవడం ఇలా పలు రకాలైన పోలీసు సేవలను అందించేందుకే ఇక్కడ
అవుట్ పోస్టు ప్రారంభించామన్నారు. మహిళలు ఒంటరిగా ఆటోల్లో ప్రయాణించేందుకు
ఇబ్బంది పడితే అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం తెలియజేస్తే వారిని ఆటో ఎక్కించి
నెంబరు, డ్రైవర్ ఫోన్ నంబర్ గుర్తించి క్షేమంగా ఇంటికి
పంపించే చర్యలు చేపడతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఎస్పీలు కృష్ణమూర్తి,
చక్రవర్తి, సి.ఐ శంకరరావు, ఆర్టీసి ఆర్.ఎం. అప్పలరాజు, డిప్యూటీ సీటీఎం
శ్రీనివాస్, డిఎం కవిత తదితరులు పాల్గొన్నారు.