యూనిట్

కర్నూలు జిల్లా పోలీస్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కర్నూలు పోలీస్‌ వెబ్‌సైట్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.గిరిధర్‌ ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ అధికారులు కేసులను పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి అన్నిరకాల శాస్త్రీయ ఆధారాలు సేకరించినప్పుడే నిందితులకు శిక్షలు పడతాయన్నారు. పోలీస్‌ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయడానికి వెబ్‌సైట్‌ను ప్రారంభించినందుకు ఎస్పీకి అభినందనలు తెలియజేసారు. అనంతరం ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ పలు రాష్ట్రాల వెబ్‌ సైట్‌లను పరిశీలించి డీజీపీ గారి అనుమతితో ఈ వెబ్‌సైట్‌ రూపొందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాలుగో అదనపు జిల్లా జడ్జ్‌ వి.శ్రీనివాస్‌, ఆరో అదనపు జిల్లా జడ్జి ఆర్‌.వీ.నాగసుందర్‌, అనిశాకోర్టు న్యాయమూర్తి భాస్కరరావు, అదనపు ఎస్పీ దీపికా పాటిల్‌, ఓఎస్డీ ఆంజనేయలు, ఏ.ఆర్‌.అదనపు ఎస్పీ రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని