యూనిట్

గవర్నర్ చేతుల మీదుగా ''బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డ్'' అందుకున్న కర్నూలు ఎస్పీ

2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ సేవలందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను  జనవరి 25 , 10 వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ , విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్ర స్ధాయి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర గవర్నర్  బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్  అవార్డులను అందజేశారు. 

కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి  2019 బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అందుకున్నారు. 

ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు గాను, ఎన్నికలలో  ఈ సీజర్ , నాకా బంది, ఎలక్షన్ ఎపి పోలీసు డాట్ కామ్ వెబ్ అప్లికేషన్ లకు సంబంధించిన టెక్నాలజీలను వినియోగిస్తూ  చెక్ పోస్టులలో ఈ - టెక్నాలజిల ద్వారా రియల్ టైమ్ బేసిస్ లో వాహానాల తనిఖీలు, ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు  అప్ లోడ్ చేస్తూ అక్రమరవాణా కు అడ్డుకట్ట వేయడం జరిగింది.

సార్వత్రిక ఎన్నికల్లో సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించినందుకుగాను స్పెషల్ కేటగిరి క్రింద 'IT initiatives' in special category విభాగంలో  కర్నూలు జిల్లా ఎస్పీ గారికి ఈ అవార్డు ప్రదానం చేశారు.

బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీస్ అవార్డ్స్ అందుకున్న  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐపియస్ అధికారులు   అడిషనల్ డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్, డాక్టర్  రవిశంకర్  అయ్యన్నార్ , కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి లు  డిజిపి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని మర్యాదపూర్వకంగా  కలిశారు.

 కర్నూలు జిల్లా పోలీసు శాఖ తరపున బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ పురస్కారాన్ని స్వీకరించిన కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లికి జిల్లా పోలీసు యంత్రాంగంపలువురు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.  

వార్తావాహిని