యూనిట్

ఎఆర్ పోలీసులకు పోలీసు దర్బార్ కార్యక్రమం నిర్వహించిన కర్నూలు ఎస్పీ

పోలీసుల సంక్షేమానికి, సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా  కృషి చేస్తామని  కర్నూలు జిల్లా ఎస్పీ   జి. కృష్ణకాంత్  అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఆర్ముడు రిజర్వుడు పోలీసులతో పోలీసు దర్బార్ నిర్వహించారు. ఈ సందర్బంగా  ఎస్పీ  మాట్లాడుతూ  సిబ్బంది సమస్యల తీవ్రతను బట్టి పరిష్కరించుటకు కృషి చేస్తామన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే జిల్లా పోలీసు కార్యాలయంలో తనకు నిర్భయంగా తెలియజేసుకోవచ్చన్నారు. తనకు  మెసెజ్ గాని లేదా వాట్సప్ కు గాని సమాచారం తెలియజేయవచ్చన్నారు.  సమస్యను బట్టి  సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తామన్నారు.  వేసవికాలంలో వేడి తీవ్రతగా ఎక్కువగా ఉన్నందున బయట విధులు నిర్వహించే పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు.  ఎఆర్స్పెషల్ పార్టీ పోలీసుల బందోబస్తులు, ఎస్కార్ట్ డ్యూటీలుసినియార్టీ లిస్టు, ఎఆర్ నుండి సివిల్ కన్వర్షన్మ్యూచువల్ బదిలీలు తదితర సమస్యల గురించి ఎస్పీకి ఎఆర్ పోలీసులు విన్నవించుకున్నారు. వారి సమస్యలను  విని, తగిన పరిష్కారం చూపుతానని సిబ్బందికి భరోసా కల్పించారు. 50 ఏళ్ళ వయస్సు దాటి విధులు నిర్వహించే పోలీసులు పికెట్ లలో, ఇతర విధులు నిర్వహించే వారికి  తగిన పరిమిషన్లు  ఇస్తామన్నారు. పోలీసు విధులలో మంచి ప్రతిభ కనబరచిన వారికి ఒక కమిటి ఏర్పాటు చేసి పారదర్శకంగా అవార్డులు అందజేస్తామన్నారు.  కార్యక్రమంలో  అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్  , డిపిఓ ఎఓ సురేష్ బాబు, ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషాఆర్ ఐలు ... వియస్ రమణ, పోతుల రాజు, శివారెడ్డి, రవి కుమార్, ఆర్ ఎస్సైలు, ఎఆర్ పోలీసు సిబ్బంది   ఉన్నారు.

వార్తావాహిని