యూనిట్
Flash News
ఆధునికరించీ నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మిగనూరు సబ్ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన కర్నూలు ఎస్పీ
ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని రహదారిలో ఉన్న
జలవనరుల శాఖ అతిథిగృహంలో
ఆధునికరించీ నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మిగనూరు పోలీసు సబ్ డివిజన్ కార్యాలయాన్ని
గురువారం జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్
ప్రారంభించారు. అనంతరం ఆఫీసర్
విజిటింగ్ బుక్ లో సంతకం చేసి , డిఎస్పీ కార్యాలయం ఆవరణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే శ్రీ చెన్నకేశవ
రెడ్డి, మంత్రాలయం ఎమ్మేల్యే శ్రీ బాల నాగిరెడ్డి ఉన్నారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ
మాట్లాడారు. ఎమ్మిగనూరు సబ్
డివిజన్ ఏర్పడిన తర్వాత డిఎస్పీ ఆఫీసు ను
ఆవిష్కరణ చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. సహాయ సహాకారాలు అందించిన వారికి
అభినందనలు తెలుపుతున్నామన్నారు. జిల్లాల
పునర్ వ్యవస్ధీకరణ జరిగిన తర్వాత
ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ ఆఫీసు ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి స్థాయి అధికారికి
విన్నవించుకోవచ్చన్నారు.