యూనిట్

ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన కర్నూల్ ఎస్పీ

కర్నూల్ జిల్లా పోలీసుల సంక్షేమానికి పోలీసుశాఖ కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. పోలీసు సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా నగరంలోని కోత్తపేట లో గల పోలీసు క్వాటర్స్ లో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ స్టోరేజి రిజర్వు వాటర్ ట్యాంకుకు పూజ నిర్వహించి బుధవారం ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎస్పీ   మాట్లాడుతూ  పోలీసు కుటుంబాలకు తాగు నీటి కొరత తీర్చడానికి మరియు వేసవి కాలంలో  నీటి సరఫరా సమస్యలు లేకుండా ఈ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించామన్నారు.  రూ. 27.8 లక్షల నిధుల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ వారి సహాకారంతో ఈ ట్యాంకును నిర్మించామన్నారు. ఈ ఓవర్ హెడ్ ట్యాంకు 40 వేల కిలో లీటర్ల నీటి సామర్ధ్యం కలదన్నారు. నగరంలోని కోత్తపేట లైన్ లోని 16 ఆర్ ఎస్సై క్వాటర్స్ కి , 55  ఎ ఆర్ పోలీసు క్వాటర్స్ కి మరియు  వేల్పేర్ హాస్పిటల్  కు  ఈ ఓవర్ హెడ్ ట్యాంకు నుండి నీటి సౌకర్యం అందుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ   ఇలియాజ్ భాషా, డి ఈ  సత్యనారాయణ, ఆర్ ఐలు   రామక్రిష్ణ,   రాధాక్రిష్ణ,  ఎ ఈ లు  మోహన్ రెడ్డి, శ్రీ హారి,  కంట్రాక్టర్  వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.

వార్తావాహిని