యూనిట్

దిశ చట్టం పై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కర్నూల్ జిల్లా ఎస్పీ

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం - 2019 పై అవగాహన ర్యాలీని నిర్వహించారు.  వివిధ శాఖల సమన్వయంతో ఈ ర్యాలీలు జనవరి 30 వరకు ఉంటాయి.  ఈ సంధర్బంగా ఈ అవగాహన ర్యాలీకి  జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి   ముఖ్య అతిధిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ నుండి పాతబస్టాండు కోట్ల సర్కిల్ (కంట్రోల్ రూమ్ ) వరకు ఈ ర్యాలీ సాగింది.

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ  మహిళలు, బాలికల పై ఏవరైనా వేధింపులకు, హింసలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడానికి  ఆంద్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు గత నెలలో దిశా చట్టం ను తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయ స్ధాయిలో ఈ చట్టంకు అత్యంత ప్రాముఖ్యత తీసుకురావాలని కృషి చేస్తున్నారన్నారు. మహిళల భధ్రత విషయంలో అన్ని చట్టాల కంటే దిశ చట్టం ను కఠినమైన చట్టంగా రూపొందించి తీసుకువచ్చారన్నారు. మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడితే నిందితులకు మరణ శిక్ష పడేవిధంగా దిశ చట్టం తీసుకువచ్చారన్నారు.  మహిళలను సోషల్ మిడియాలో (వాట్సప్, ఫేస్ బుక్) ఏవరైనా వేధింపులకు గురి చేసే  వారిపై కూడా ఈ దిశా చట్టం క్రింద కఠిన శిక్షకు గురి చేస్తారన్నారు.  మహిళలపై అఘాయిత్యాలు జరిగిన కేసుల్లో (నేర విచారణ, దర్యాప్తులు పూర్తి చేసి ) నిర్ధిష్టమైన ఆధారాలతో కేవలం 3 వారాల్లో (21 రోజులు)నే  నిందితులకు శిక్షలు పడే విధంగా పకడ్బందీగా ప్రణాళికా బద్దంగా ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం ను అమలులోకి తీసుకువచ్చారన్నారు. కర్నూలు  జిల్లాలో దిశా పోలీసుస్టేషన్ త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.  అదనంగా సిబ్బందిని నియమిస్తూ దిశా పోలీసుస్టేషన్ ను కూడా కర్నూలులో ఈ నెలలోనే ప్రారంభిస్తామన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న సఖి సెంటర్ ను దిశా సెంటర్ గా మారుస్తున్నారన్నారు.  ఎక్కడా కూడా మహిళలపై అత్యాచారా ఘటనలు పునరావృతం కాకుండా ఆపడానికి గట్టి చర్యలు , అప్రమత్తత , అవగాహన కార్యక్రమాలు అవసరమన్నారు.  ఈ జనవరి మాసాన్ని దిశా మాసంగా పరిగణిస్తున్నారన్నారు. ఈ మాసంలో దిశా చట్టం పై అవగాహన కార్యక్రమాలు చేపట్టి  ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.  ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపియస్   తుషార్ డుడి, పిడి ఐసిడిఎస్ శ్రీమతి బాగ్య రేఖ,  ఎపిడి – ఐసిపిఎస్ శ్రీమతి విజయ,  డిఆర్ డిఎ పిడి శ్రీ శ్రీధర్ రెడ్డి, కర్నూలు సిడిపిఓ శ్రీమతి వరలక్ష్మీ, మెప్మా ఎపిడి   నాగరాజు, ఓఎస్ సి స్టాఫ్ మేరి స్వర్ణలత,  జిల్లా బాలల పరిరక్షణ అధికారి శ్రీమతి శారద,  డిపిఓ స్టాఫ్ వెంకటసుబ్బా రెడ్డి, పొదుపు మహిళలు, నర్సింగ్ కళాశాల విద్యార్దినులు,  అంగన్ వాడి వర్కర్స్, టీచర్స్, పాఠశాలల విద్యార్దులు పాల్గొన్నారు. 

వార్తావాహిని