యూనిట్

చిన్నారులకు పుస్తకాలు, బ్యాగ్ లను పంపిణీ చేసిన కృష్ణ జిల్లా అదనపు ఎస్పీ

ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా దత్తత స్వీకరించిన నారాయణపురం  ప్రాంతంలోని చిన్నారుల  కుటుంబ సభ్యులను మంగళవారం కృష్ణ  జిల్లా అడిషనల్ ఎస్పీ   సత్తి బాబు   కలిశారు. అనంతరం అక్కడ ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన  సమావేశంలో దత్తత స్వీకరించిన పది మంది చిన్నారులకు పుస్తకాలు, బ్యాగ్ లు,  పెన్నులు అందజేశారు. ఈ సందర్భముగా  ఆయన మాట్లాడుతూ కేవలం విద్య పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా,  వారి ప్రాంత అభివృద్ధి పరంగా కూడా పోలీసు శాఖ తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్, సిడిపిఓ లక్ష్మీ, బందర్ డిఎస్పి మహబూబ్ బాషా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు   నిర్మల, తదితరులు పాల్గొన్నారు. 

వార్తావాహిని