యూనిట్

ప్రధాన కార్యాలయంలో ఐటి రిటర్న్‌ దాఖలుపై అవగాహన

మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపాల్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ ఎం. భూపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఐటి రిటర్న్స్‌ దాఖలుపై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఐజి మహేష్‌ చంద్ర లడ్హా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి డిజిపి శ్రీ డి. గౌతమ్‌ సవాంగ్‌ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో పని చేసే ప్రతి ఒక్కరం స్వయంగా ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలును చేసుకొనే అవకాశం ఉన్నదని, ఈ నిమిత్తం అందరికి అవగాహన కల్పించేందుకు ఆదాయపు శాఖ వారు మన కార్యాలయంలోనే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. నిత్యం తీరికలేని విధి నిర్వహణతో ఉండే మనం ఇది ఎంతో పెద్ద వ్యవహారం అనుకుని ఇతరులపై ఆధారపడతామని, ఇక్కడి అవగాహనతో ఎవరికి వారు స్వయంగా ఐటి రిటర్న్స్‌ దాఖలు చేసుకోగలుగుతారన్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మెళకువలు తెలుసుకోవాలన్నారు. ఐటి రిటర్న్స్‌ ఎలా దాఖలు చేయాలి, దీనివలన కలిగే ప్రయోజనాలు గురించి ఇన్‌కంట్యాక్స్‌ కమిషనర్‌ ఎం. భూపాల్‌ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు అమిత్‌గార్గ్‌ ,రవిశంకర్‌ అయ్యన్నార్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని