యూనిట్
Flash News
పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు : శ్రీకాకుళం ఎస్పీ

సాంకేతికంగా
ఎంత అభివృద్ధి సాధించిన పుస్తక పఠనం వలన మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. కోటబొమ్మాళి మండలం జియ్యన్న పేటలో
జిల్లా పోలీస్ శాఖ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని ఆయన ప్రారంభించిన
సందర్భముగా మాట్లాడారు. పోలీస్ శాఖలోని హోంగార్డుల ఎంపికలో ఈ గ్రామానికి చెందిన
యువతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఎస్పీవో, సిపివోలుగా పనిచేసేందుకు ముందుకు వస్తే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
మావోయిస్టు ప్రాభల్యం గల గ్రామాల్లో పోలీస్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి
గ్రంధాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సి.ఐ వెంకటేశ్వర
రావు, ఎస్సైలు లక్ష్మణ రావు, కామేశ్వర
రావు తదితరులు పాల్గొన్నారు.