యూనిట్

ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడమే 'స్పందన'

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు, రాష్ట్ర డిజిపి శ్రీ డి. గౌతమ్‌ సవాంగ్‌ గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కేంద్రం నందు ప్రజల ఫిర్యాదులు తీసుకునే కార్యక్రమాన్ని ''స్పందన''అనే పేరుతో నిర్వహించడం జరుగుతుందని, ప్రజా సమస్యలు, ఫిర్యాదులను పోలీసులతో నిర్భయంగా చెప్పడం కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ స్పందన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్‌.పి. చింతం వెంకట అప్పలనాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోనే కాకుండా నాలుగు సబ్‌ డివిజన్‌లలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌లలోను ఈ 'స్పందన' కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. బాధితుల సమస్యలపై అలసత్వం లేకుండా సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్‌లకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు ఏఆర్‌ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. భూమి తగాదాల విషయంపై, భార్యభర్తల గొడవలు, డబ్బు సంబంధించిన విషయాలపై ఇంకొందరు.. ఇంట ిస్థలాల ఆక్రమణ గొడవలు కొందరు ఇలా సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు, ఒకే రోజు 36 ఫిర్యాదులు/సమస్యలను వినతుల రూపంలో బాధితులు విన్నవించుకున్నట్లు చెప్పారు. ఈ ఫిర్యాదులకు ఎస్పీ స్పందిస్తూ త్వరిత గతిన విచారణ జరిపి ఫిర్యాదుదారులకి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వార్తావాహిని