యూనిట్
Flash News
పాత కక్షలతో హత్య
విశాఖపట్నం
నగరంలోని వాంబే కాలనీలో హత్యకు గురైన విల్లపు రాంబాబు హత్య కేసును ఛేదించి
నిందితులను అరెస్టు చేసినట్లు నగర శాంతి భద్రతల డిసిపి - 1 ఎస్.రంగా రెడ్డి తెలిపారు. కేసు వివరాలను
ఆయన వెల్లడించారు. మృతుడు విల్లపు రాంబాబుకు ప్రధాన నిందితుడైన పూతి వెంకటేష్
అలియాస్ పొట్టి వెంకటేష్‌కు పాత తగాదాలు వున్నాయి. తగాదాల నేపధ్యంతో అతని పై కక్ష
పెంచుకుని ఎలాగైనా హత్య చేయాలని తలచి తన స్నేహితుల సహాయంతో కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడితో
పాటు నిందితులైన ఏందవా సంతోష్ కుమార్, జామి నవీన్
రెడ్డి, బోయి నవీన్, కడితి
సందీప్ కుమార్, గడగమ్మ బాలాజీ రాకేష్, అలుపున సంతోష్ భవాని శంగర్ రెడ్డి మరియు పువ్వల నారాయణను అరెస్టు
చేసినట్లు తెలిపారు. కేసులో మంచి పనితీరు కనబర్చిన నార్త్ డివిజన్ ఎసిపి ఆర్.రవి
శంకర్ రెడ్డి, పి.ఎం.పాలెం సి.ఐ ఎ.రవికుమార్‌లను డిసిపి అభినందించారు.