యూనిట్

ఆరుగంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదన

ఆరుగంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదన తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అపహరణకు గురైన సుమారు మూడు సంవత్సరముల పాపను కేవలం ఆరు గంటల్లోనే ఛేదించారని తిరుపతి అర్భన్‌ ఎస్పీ కే.కే.యన్‌. అన్భురాజన్‌ తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు. తిరుపతి గాంధీ నగర్‌కు చెందిన పవన్‌ కుమార్‌, అతని భార్య రేఖ ప్రియ తిరుపతిలోని భూమా సినీ కాంప్లెక్స్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం సినిమా అయిన తర్వాత ప్రేక్షకులు బయటికి వెళ్లారు, అదే సమయంలో తల్లిదండ్రులతో పాటు బయటకు వెళ్ళే సమయంలో వాళ్ళ కూతురు భాగ్యశ్రీ, వయసు 3 సంవత్సరాలు కూడా ఆడుకుంటూ తల్లిదండ్రులతో పాటు బయటికి వెళ్ళింది. సుమారు 30 నుండి 35 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి పాపను తీసుకొని వెళ్ళాడు. దీనిపై తల్లిదండ్రులు ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినారు, వెంటనే స్పందించిన ఈస్ట్‌ పోలీసు సిబ్బంది భూమా కాంప్లెక్స్‌ కు వెళ్లి విచారించి చుట్టుప్రక్కల వెతికారు. వెంటనే తిరుపతి కమాండ్‌ కంట్రోల్‌ వెళ్లి భూమా కాంప్లెక్స్‌ ఏరియా పరిధిలోగల సీసీ పుటేజ్‌ లను పరిశీలించి, భాగ్యశ్రీని ఎత్తుకొనిపోయిన వ్యక్తి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్ళి బస్టాండ్‌ నుండి చిత్తూరు బస్సు ఎక్కి వెళ్ళాడని గుర్తించారు. సంబందిత వ్యక్తి యొక్క ఫోటోలను చిత్తూరు పోలీస్‌ వారికి మరియు సోషల్‌ మీడియాలో విరివిగా ప్రచారం చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఆగంతుకుడు పాపను చిత్తూర్‌ 1 వ పట్టణ పోలీస్‌ పరిదిలో మిట్టూర్‌ నందు వదిలిపెట్టి పారిపోయాడు. సామాజిక మాధ్యమాల ద్వారా పాప యొక్క ఫోటోను గుర్తించిన ప్రజలు తిరుపతి ఈస్ట్‌ పోలీసు వారికి సమాచారం ఇవ్వగా అదే ప్రాంతంలో వున్న ప్రత్యేక బందం పాపను గుర్తించి స్వాదీనపరచుకున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని కిడ్నాప్‌ అయిన 6 గంటలలోపే ఛేదించిన ఈస్ట్‌ పోలీసుల జిల్లా యస్‌. పి. అభినందనలు తెలియజేసారు.

వార్తావాహిని