యూనిట్

పోలీస్‌ విధి నిర్వహణలో జాగిలాలు సహయకారిగా వుంటాయి

శిక్షణ పొందిన జాగిలాలు పోలీస్‌ విధి నిర్వహణలో అత్యంత సహయకారిగా వుంటాయని ఇంటెలిజెన్స్‌ ఎస్‌.ఎస్‌.జి ఎస్‌.సెంధిల్‌ కుమార్‌ అన్నారు. మంగళగిరి ఎపిఎస్పీ బెటాలియన్‌లోని కెనైన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నందు మూడవ బ్యాచ్‌ జాగిలాల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అథిగా హజరై మాట్లాడారు. శిక్షణకు వచ్చిన జాగిలాలకు ఎనిమిది నెలల కాలం పాటు నేర్పుతో, ఓర్పుతో శిక్షణ ఇచ్చి ఉత్తమ పోలీస్‌ జాగిలాలుగా తీర్చి దిద్దాలని సూచించారు. ఈ శిక్షణలో వివిధ జిల్లాలకు 23 జాగిలములు, ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖకు 6 జాగిలములు కేటాయించడం జరిగింది. వీటిలో 16 జాగిలములకు ప్రేలుడు పదార్ధములు గుర్తించడంలో, 7 జాగిలాలకు నేర పరిశోధన యందు, అటవీ శాఖకు చెందిన ఆరు జాగిలాలకు ఎర్రచందనం గుర్తించడంలో శక్షణ ఇస్తారు. జాగిలాలకు లవ్‌ అండ్‌ ఎఫెక్షన్‌ మరియు వినయంను నేర్పిస్తారు. వీటి శిక్షణ నిమిత్తం వివిధ జిల్లాల నుండి 35 మంది హ్యాండ్లెర్స్‌ కూడా శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ కార్యక్రమానికి డైరక్టర్‌గా డిఎస్పీ వి.వి.వి.సత్యనారాయణ, కోర్సు కో - ఆర్డినేటర్‌గా టి.నాగ శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో ఐఎస్‌డబ్యూ అడ్మిన్‌ ఎస్పీ టి.రామ ప్రసాద్‌, ఐఎస్‌డబ్యూ ఎస్పీ రెడ్డి. గంగాధర్‌ రావు, అడ్మిన్‌ అదనపు ఎస్పీ డి.నాగేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని