యూనిట్
Flash News
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
73వ స్వాతంత్య్ర దినోత్స వేడుకలు 6వ పటాలము మంగళగిరిలో ఘనంగా జరిగాయి. ముందుగా కమాండెంట్ గజరావ్ భూపాల్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, వేడుకలకు స్వాగతం పలికారు. అనంతరం పటాలము సిబ్బంది జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. అనంతరం యూనిట్ల వారీగా మార్చ్‌ఫాస్ట్ చేసి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కమాండెంట్ గజరావ్ భూపాల్ మాట్లాడుతూ 73 సంవత్సరాల క్రితం ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా నేడు మనం అనుభవిస్తున్న ఈ సుఖమేనన్నారు. నాడు తెల్లదొరల అణచివేతకు గురయిన మనం నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మొదలు ప్రపంచస్థాయిలో భారత్ వెలిగిపోతోందన్నారు. నాటి స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను మనం నేటితరం విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, వాటిని మనందరము కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎస్.సాయిప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్ హనుమంతు, పటాలములోని కుటుంబ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొని, వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.