యూనిట్
Flash News
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 2వ పటాలములో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని కమాండెంట్ ఎస్.కె.హుసేన్‌సాహెబ్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం పటాలము సిబ్బంది గౌరవ వందనం చేశారు. పటాలము పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శన, నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశస్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ డాక్టర్ ఎస్.కె. అల్లాబకష్, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇతర ఉన్నతాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అందరూ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.