యూనిట్

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్‌ కార్యాలయంనందు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్య్రంను సాధించారని వారిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ఏఆర్‌, ట్రాఫిక్‌, హోంగార్డ్స్‌, సివిల్‌ పోలీసులు పాల్గొన్నారు.

వార్తావాహిని