యూనిట్
Flash News
నిజాయితీతో పనిచేసి మాజీ సైనికుల ఇమేజ్ ని పెంచండి: నెల్లూరు ఎస్పీ

నిజాయితీతో పనిచేసి మాజీ సైనికుల ఇమేజ్ ని పెంచాలని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో స్పెషల్ పోలీసు ఆఫీసర్స్ గా నియమించబడిన మాజీ సైనికులు మరియు పోర్టు సెక్యురిటీ సిబ్బందికి నియామక పాత్రలను అందజేశారు. వారిని ఉద్దెశించి ఎస్పీ మాట్లాడుతూ ఏడుగురు మాజీ సైనికులకు, 13 మంది కె. పి పోర్టు సెక్యురిటీ సిబ్బందికి జిల్లాలో ఏర్పాటు చేయబడిన 3 చెక్ పోస్టులు మరియు 2 మొబైల్ పార్టీల సిబ్బందితో కలిసి విధులు నిర్వహించేందుకు నియమించామన్నారు. నెల్లూరు జిల్లాలో ఇసుక మరియు మద్యం అక్రమ రవాణాను పూర్తిగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తడ వద్ద, జీరో పాయింట్ శ్రీసిటీ నుండి తడ వరకు చెక్ పోస్టు, పెరియపట్టు నుండి తడ వరకు రెండవ చెక్ పోస్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతం అయిన వెంకటగిరి ఫోర్ రోడ్డు జంక్షన్ లో మరొక చెక్ పోస్టు ఏర్పాటు చేసినారు. ఇవి కాక రెండు ప్రత్యేక మొబైల్ పార్టీలను జీరో పాయింట్ శ్రీసిటీ నుండి సూళ్ళూరుపేట, శ్రీసిటీ నుండి పన్నంగాడు వరకు ఏర్పాటు చేయబడినవున్నారు. స్పెషల్ పోలీసు ఆఫీసర్స్ 16 మంది సూళ్ళూరుపేట సి ఐ వద్ద మరియు నలుగురు వెంకటగిరి సి ఐ వద్ద రిపోర్ట్ చేసుకోవలసిందిగా ఆదేశాలు జారీచేయడమైనది. వీరికి కన్సాలిడేటెడ్ గా నెలకు రూ.15,000/- జీతం ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమంలో యస్.బి. డి.యస్.పి. యన్.కోటా రెడ్డి, యస్.బి. సి ఐ శ్రీనివాసులు రెడ్డి హాజరుగా వున్నారు.