యూనిట్

సిసి కెమెరాలు ప్రారంభించిన జిల్లా యస్.పి.

12.01.2020 న ఉదయం 11.00 గంటలకు,  జిల్లా SP., భాస్కర్ భూషణ్, IPS., గారు, నెల్లూరు టౌన్, రామ్మూర్తి నగర్, 3rd లైన్, NR ఫంక్షన్ హాల్ వద్ద, టౌన్ DSP, CI బాలాజీ నగర్, రామమూర్తి నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానికుల సమక్షంలో ఆ ఏరియా భద్రత కోసం ఏర్పాటు చేసి, పోలీస్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయబడిన 33 సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి. గారు మాట్లాడుతూ రాత్రి పూట కూడా చీకటిలో పనిచేసే ఇన్ఫ్రారెడ్ వ్యవస్థ కలిగిన 33
CC కెమెరాలను స్థానికుల భద్రత కోసం హరితా సిస్టమ్స్ వారిచే ఏర్పాటు చేయించిన రామమూర్తి నగర్ రెసిడెంట్స్ అసోసియేషన్ సభ్యులు అభినందనీయులని, రానున్న సంవత్సరం కాలంలో కమర్షియల్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎడుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ , బ్యాంక్స్, ATM లు, రెసిడెన్సియల్ ప్రాంతాలు , అన్ని వీధులు, జంక్షన్ పాయింట్ లలో 10 వేల CC కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి అన్నింటిని కమాండ్ కంట్రోల్ కి అనుసందానం చేయాలని, నెల్లూరు జిల్లా మొత్తాన్ని CCTV నిఘా నీడలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇందుకు జిల్లా ప్రజల సహకారం ఎంతో అవసరం ఉందని తెలిపారు. రాబోయే రోజులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విరివిగా ఉపయోగించుకొని, విజిబుల్ పోలీసింగ్ తో పాటు ఇన్ విజిబుల్ పోలీసింగ్ ను మరిన్ని రెట్లు పెంచి నిఘా వ్యవస్థను 24x7 జిల్లా అంతటా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. నేరాలను నిరోధించటంలోనూ మరియు నేరస్తులను గుర్తించడంలో CC కెమెరాలు మరియు కమాండ్ కంట్రోల్ పాత్ర అమోఘమని జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు 3 వేల కెమెరాలు నెల్లూరు టౌన్ లో ఏర్పాటు చేయనున్నామని ఈ సందర్భంగా టౌన్ డి.యస్.పి. గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టౌన్ డి.యస్.పి. జె.శ్రీనివాసులు రెడ్డి
, సి.ఐ. బాలాజీ నగర్ YV సోమయ్య, కమ్యూనికేషన్ ఎస్.ఐ. డి.సురేంద్ర బాబు, ఎలెక్ట్రికల్ AE
 గోపాల్ రెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి  యస్.రమణయ్య, అధ్యక్షులు పి. శేషా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకు రెడ్డి,  బాలాజీ నగర్ యస్.ఐ. గార్లు,  సిబ్బంది మరియు రామమూర్తి నగర్ వాసులు పాల్గొన్నారు. 

వార్తావాహిని