యూనిట్
Flash News
రైతులు, మహిళల ' స్పందన' ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత- కడప జిల్లా ఎస్పి అన్బురాజన్, IPS
జిల్లాలో ' స్పందన' కార్యక్రమంలో భాగంగా రైతులు, మహిళలు ఇచ్చే ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని జిల్లా ఎస్.పి శ్రీ కె.కె.ఎన్.అన్బురాజన్ ఐ.పి.ఎస్., గారు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో 'స్పందన' కార్యక్రమంలో భాగంగా బాధితులతో ముఖాముఖి మాట్లాడి వారి నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయంలో ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. నడవలేని, అనారోగ్యంతో ఉన్న ఫిర్యాదుదారుల వద్దకే వచ్చి జిల్లా ఎస్.పిగారు ఫిర్యాదులను స్వీకరించారు.
మహిళలకు సంబంధించి వేధింపులు, కుటుంబ సమస్యలతో వచ్చే ఫిర్యాదు దారులకు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకోకుండా వారి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి కౌన్సిలింగ్ నిర్వహించి పరిష్కరించాలని సూచించారు.
ఎక్కడైనా మహిళలు వేధింపులకు పాల్పడితే చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయా మహిళలకు తగిన రక్షణ కల్పించాలని జిల్లా ఎస్.పి గారు ఆదేశించారు. జిల్లా ఎస్.పి గారు స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఫిర్యాదు దారులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్.పి గారి మానవత కు కృతజ్ఞతలు తెలియచేసారు.