యూనిట్

అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు 30 పోలీసు యాక్టు అమలు

       జనవరి ఒకటి నుండీ 31 వరకు అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీసు యాక్టు అమల్లో ఉంటుందని అనంతపురం ఎస్పీ బి సత్య యేసు బాబు  ఒక ప్రకటనలో తెలియజేశారు. రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలు తమతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు, ధర్నాలు , బహిరంగ సభలు, సమావేశాలు అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించదలిస్తే 48 గంటలు ముందుగా తన అనుమతి తీసుకోవాలన్నారు. అలా... అనుమతి లేకుండా నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.

వార్తావాహిని