యూనిట్
Flash News
భక్తిశ్రద్ధలతో నిమజ్జనం

భక్తిశ్రద్ధలతో నిమజ్జనం 6వ పటాలము ఆవరణలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రులు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పోలీసు సిబ్బంది పటాలము కమాండెంట్ డాక్టర్ గజరావు భూపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు గణనాథున్ని నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్ళారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఈఎస్‌ఎస్ సాయిప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్లు శ్రీనివాస బాబ్జి, శ్రీరామమూర్తి, పటాలము ఆర్.ఐ.లు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.