యూనిట్
Flash News
స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు తక్షణ చర్యలు

గుంటూరు అర్భన్ జిల్లా పరిధిలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ తెలిపారు. ప్రతి ఫిర్యాదు దారునితో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలపై అధ్యయనం చేసి పూర్తి పారదర్శకంగా పరిష్కరిస్తున్నామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో నమోదవుతున్న ఫిర్యాదులు నేరుగా ఎస్పీ కార్యాలయానికి అనకుసంధానం చేసేలా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆపదలో వుండి పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారికి పోలీసుల అధికారులు అండగా వుండి వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం వుందని తెలిపారు. బాధితులకు సరైన న్యాయం చేసే విధంగా పోలీసు అధికారులు విధులు నిర్వర్తిస్తే రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.