యూనిట్
Flash News
అక్రమంగా దాచివుంచిన రెడ్ శాండల్ దుంగలు స్వాధీనం
అక్రమంగా దాచివుంచిన రెడ్ శాండల్ దుంగలు స్వాధీనం చిత్తూరు జిల్లా రైల్వే కోడూరు రెడ్‌శాండర్స్ పోలీసుల పరిధిలోని ఎన్.వి.ఎస్. గిరిజన కాలనీలో అక్రమంగా 22 రెడ్‌శాండల్ దుంగలను భూమిలో పాతినట్లు సమాచారం అందింది. వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు నలుగురు స్మగ్లర్లతోపాటు, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వెపన్‌తోపాటు గన్ పౌడర్ ఇతర అక్రమ ఆయుధాలకు సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని రెడ్‌శాండల్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి, ఎస్.పి. పి. రవిశంకర్, డిఎస్‌పి, ఇతర ఉన్నతాధికారులు నేరస్థలాన్ని పరిశీలించి, కేసును చాకచక్యంగా చేధించినందుకు అభినందనలు తెలిపారు.