యూనిట్
Flash News
అమరవీరుల కుటుంబ సభ్యులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను
అమరవీరుల
కుటుంబ సభ్యులును నా స్వంత కుటుంబ సభ్యులుగా భావిస్తానని ప్రకాశం జిల్లా ఎస్పీ
సిద్దార్ధ కౌశల్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అమరవీరుల కుటుంబాలతో
ఎస్పీ ప్రత్యేక సమావేశమైన సందర్భముగా మాట్లాడారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి
సమస్యలు ఏమైనా వుంటే చెప్పమని అడిగారు. వారు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తానని
హామీ ఇచ్చారు. వారి సంక్షేమం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సహాయ, సహాకారం అందిస్తూ అండగా నిలుస్తుందన్నారు.
కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్, ఎస్బీ
సి.ఐలు బాలమురళీ కృష్ణ, ఎన్.శ్రీకాంత్‌బాబు తదితరులు
పాల్గొన్నారు.