యూనిట్

మానవత్వం చాటుకున్న పోలీసులు

73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి అర్బన్‌ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఎస్‌.పి. అన్బురాజన్‌ ఆదేశాల మేరకు స్వాతంత్య్ర వేడుకలు అనాథ ఆశ్రమాలు, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల విద్యార్థుల నడుమ పోలీసులు వేడుకలు జరుపుకున్నారు. అనాథశరణాలయాలు, వృద్ధాశ్రమాలు, మానసిక వికలాంగుల ఆశ్రమాలకు పోలీసులు వెళ్ళారు. అక్కడే జాతీయ జెండాలను ఆవిష్కరించిన పోలీసులు, వారితోనే కేక్‌లు కట్‌చేయించి వేడుకలు జరిపారు. ఆహారపదార్థాలు, మిఠాయిలు పంచిపెట్టారు. మీకుతోడుగా మేమున్నామంటూ విద్యార్థులు, వృద్ధులకు భరోసానిచ్చారు. అలాగే వారితో సరదాగా గడిపారు. దీంతో పలువురు విద్యార్థులు, వృద్ధులు తమ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. వేడుకలు ఇలా జరుపుకోవడం మాకు సంతోషాన్నిచ్చాయని అర్బన్‌ పోలీసులు తెలిపారు.

వార్తావాహిని