యూనిట్

ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలోని ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు

 కార్యాలయంలో పనిచేసేందుకు 8 ఉద్యోగాల భర్తీ  కోసం  దరఖాస్తు చేసుకోవాలని  జిల్లా ఎస్పీ సిధార్థ కౌశల్ కోరారు. దరఖాస్తుల స్వీకరణకు జిల్లా పెరేడ్ మైదానంలో సహాయ కేంద్రాలను, పోలీస్ కల్యాణ మండపంలో దరఖాస్తు స్వీకరణ కోసం అయిదు  కేంద్రాలను ఏర్పాటు చేసారు. అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ జరిగింది.పెద్ద సంఖ్యలో హాజరైన నిరుద్యోగులు 1800 మంది దరఖాస్తులు చేసుకున్నారు.  వారిలో అర్హులైనవారిని ఎంపిక చేసి తిరిగి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.  మెరిట్‌ ప్రాతిపాదికన అర్హులను ఎంపిక చేసి తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ కార్యాలయం ఏ ఓ  సులోచన, ట్రాఫిక్‌ డీఎస్పీ కె.వేణుగోపాల్‌,ఎస్బీ -2 ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌బాబు,అర్‌ఐ కె.అకమ్మరావు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని