యూనిట్
Flash News
పోలీసుల సహసానికి అవార్డులతో సత్కారం

గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన దుండి నాగవర్ధన్ రెడ్డి తన కళాశాల స్నేహితులతో సూర్యలంక బీచ్‌కు స్నానానికి వెళ్లాడు . ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి నాగవర్ధన్ సముద్రంలో గల్లంతయ్యాడు. విషయాన్ని గమనించిన స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో బాపట్ల రూరల్ ఏఎస్సై రామయ్య మరియు మెరైన్ సిబ్బంది ఖాదరయ్య, నాగరాజులు సముద్రంలోకి వెళ్లి నాగవర్ధన్ రెడ్డిని రక్షించారు. గుంటూరు రూరల్ వింజనంపాడు గ్రామానికి చెందిన గోనుగుంట్ల శ్యాంకుమార్ మరియు హేమంత్ కుమార్‌లు తన కుటుంబ సభ్యులతో సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి శ్యాంకుమర్ మరియు హేమంత్ కుమార్‌లు గల్లంతయ్యారు. వెంటనే స్పందించిన మెరైన్ సిబ్బంది బోటు సహాయంతో వారిరువురనని కాపాడారు. పై రెండు ఘటనలలో ఎంతో సహాసంతో పనిచేసి ముగ్గురి ప్రాణాలు రక్షించిన సిబ్బందికి రివార్డులతో జిల్లా ఎస్పీ శ్రీమతి ఆర్.జయలక్ష్మి సత్కరించారు. రివార్డు గ్రహీతలైన ఏఎస్సై యు. రామయ్య, హెడ్ కానిస్టేబుల్‌లు పి. శ్రీధర్, టి.వి. శివాజి, ఆర్. సుగుణ, కాని స్టేబుళ్లు సి.హెచ్ పోతురాజు, పి. బాలకృష్ణ, బోట్ క్రూ ఎ. ఖదరయ్య, కె. నాగరాజు, గజ ఈతగాళ్ళు ఎ. యేడుకొండలు, కె. రాజు, ఎస్. సురేష్‌లను అభినందించారు.