యూనిట్

నెల్లూరు రొట్టెల పండుగ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన హోంమంత్రి

నెల్లూరులో అత్యంత వేడుకగా జరుగుతున్నా భారా షహీద్‌ దర్గా రొట్టెల పండుగ సందర్శన నిమిత్తం నగరానికి వచ్చిన హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారికి జిల్లా కలెక్టర్‌ ఎం.వి.శేషగిరి బాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగిలు సాదర స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి రొట్టెల పండుగకు చేసిన భద్రతా ఏర్పాట్లను గురించి గౌరవ హోంమంత్రి గారికి వివరించారు. అనంతరం ఆమె జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డిలతోపాటు బారా షహీద్‌ దర్గాను దర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర సంక్షేమం కోరి స్వర్ణాల చెరువులో రొట్టెలు అందుకున్నారు. తదుపరి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించి, ప్రత్యక్షముగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ పండుగకు అన్ని మతాలవారు, ఇతర రాష్ట్రాల వారు కూడా లక్షలాదిగా వస్తారని, వారికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీసులకు సూచించారు.

వార్తావాహిని