యూనిట్
Flash News
వృద్దులకు చేయూత..మనందరి భాద్యత - కృష్ణా ఎస్పీ
మచిలీపట్నం అమ్మ సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో
ఈడేపల్లి నందుగల జెట్టి నరసింహ ప్రభుత్వ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు దుస్తులు
పంపిణీ మరియు అన్నదాన సేవా కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్
బాబు, ఏఎస్పీ సత్తిబాబు పాల్గొన్నారు. అమరావతి వీడియో
జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలోని వృద్ధాశ్రమాల
లో ఉన్న వృద్ధులకు, నూతన వస్త్రాలు అన్నదాన వితరణ కార్యక్రమాలు
నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో నెలకి ఒక మండలంలోని వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడ
ఉన్న వృద్ధులకు వీరు సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈడేపల్లి
నందుగల జెట్టి నరసింహ ప్రభుత్వ ఆశ్రమ నందు గల 50 మంది
వృద్ధులకు నూతన వస్త్రాలు బహూకరించి, అన్నదాన కార్యక్రమం
చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన
చేతుల పై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ సేవ ట్రస్ట్
ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని ఇలాంటి సేవలు చేయడం నిజంగా మహోన్నత
వ్యక్తిత్వం సూచిస్తుందని, ఇలా చేపట్టే కార్యక్రమాల్లో
పోలీస్ శాఖ తరపున కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర,
ట్రాఫిక్ డిఎస్పి వెంకటేశ్వర్లు, ఎస్.బి. సి ఐ
చంద్రశేఖర్, ఏపీ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు చందమామ బాబు గారు,
ప్రెసిడెంట్ రమేష్ గారు, మచిలీపట్నం ప్రెస్
క్లబ్ కన్వీనర్ శేషు బాబు గారు, నాగబాబు, సాంబశివరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అమరావతి
వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాల లో ఉన్న
వృద్ధులకు, నూతన వస్త్రాలు అన్నదాన కార్యక్రమం పడుతున్నారు.
ఈ క్రమంలో నెలకి ఒక మండలంలోని వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న వృద్ధులకు వీరి
చిరు కానుక గా ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈరోజు ఈడేపల్లి నందుగల జెట్టి నరసింహ
ప్రభుత్వ ఆశ్రమ నందు గల 50 మంది వృద్ధులకు నూతన వస్త్రాలు
ధరించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు ముఖ్య
అతిథిగా విచ్చేసి ఆయన చేతుల పై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ అమ్మ సేవ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని ఇలాంటి సేవలు
చేయడం నిజంగా మహోన్నత వ్యక్తిత్వం సూచిస్తుందని, ఇలా చేపట్టే
కార్యక్రమాల్లో పోలీస్ శాఖ తరపున కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని, తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర ,
ట్రాఫిక్ డిఎస్పి వెంకటేశ్వర్లు, ఎస్ బి సి ఐ
చంద్రశేఖర్ , ఏపీ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు చందమామ బాబు
, ప్రెసిడెంట్ రమేష్ , మచిలీపట్నం
ప్రెస్ క్లబ్ కన్వీనర్ శేషు బాబు, నాగబాబు, సాంబశివరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.