యూనిట్

గుండెపోటుతో మరణించిన సీఐ మల్లి నాగేశ్వరరావు గారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 10 లక్షల రూపాయలను సమకూర్చిన తోటి బ్యాచ్ మెట్స్.

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంతేది:18.05.2023

 

గుండెపోటుతో మరణించిన సీఐ మల్లి నాగేశ్వరరావు గారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 10 లక్షల రూపాయలను సమకూర్చిన తోటి బ్యాచ్ మెట్స్.

 

10 లక్షల రూపాయల నగదును మల్లి నాగేశ్వరరావు గారి కుటుంబసభ్యులకు అందజేసిన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.

 

బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు మార్చి 20 గుండె నొప్పితో మరణించిన మల్లి నాగేశ్వరరావు గారి కుటుంబసభ్యులకు 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసినారు.

 

1996 పోలీస్ ఎస్. బ్యాచ్ కి చెందిన తోటి మిత్రుడు మల్లి నాగేశ్వరరావు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సీఐ గా విధులు నిర్వహిస్తు  హఠాత్ గా గుండెపోటుతో మరణించడం వల్ల  చిన్నాభిన్నం అయిన అతడి కుటుంబాన్ని ఆదుకోవడం కొరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విధులు నిర్వహిస్తున్న 1996 పోలీస్ ఎస్. బ్యాచ్  మేట్స్ అందరు కలిసి అక్షరాల 10 లక్షల రూపాయలు సమకూర్చినారు. వాటిని మే 18 గురువారం బాపట్ల  జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా నాగేశ్వరరావు గారి సతీమణి వెంకటలక్ష్మి, కుమారుడు అంజనీకుమార్ లకు 7 లక్షల నగదు, భర్త మరణించడంతో నాగేశ్వరరావు సంరక్షణలో జీవనం సాగిస్తున్న అతడి సోదరి వై.రాధకు 3 లక్షల రూపాయలు అందజేసారు.

 

సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సీఐ గా విధులు నిర్వహిస్తు మల్లి నాగేశ్వరరావు గారు మార్చి 20  గుండె నొప్పితో  మరణించారని, మార్చి 21 చీరాల పట్టణంలోని రాంనగర్ లో సీఐ గారి స్వస్థలంలో జరిగిన అంతిమయాత్రలో స్వయంగా పాల్గొని మల్లి నాగేశ్వరరావు గారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినప్పుడు వారు తీవ్ర శోకసంద్రంలో ఉన్నారన్నారునాగేశ్వరరావు అకాల మరణం చెందడంతో 1996 పోలీస్ బ్యాచ్ కి చెందిన తోటి బ్యాచ్ మేట్స్ మేము అండగా ఉన్నాము అని ముందుకు వచ్చి నాగేశ్వరరావు గారి కుటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సాయం అందించడం హర్షించ దగ్గ విషయమన్నారు. నాగేశ్వరరావు గారి కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని, శాఖాపరంగా కుటుంబానికి రావాల్సిన అన్ని రకాల పరిహారాలు మరియు రాయితీలు సకాలంలో అందించడానికి కృషి చేస్తామన్నారు. వారికి ఏదైనా సమస్య వస్తే నేరుగా సంప్రదించవచ్చునన్నారు

 

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ .మల్లికార్జున రావు గారు, ఎస్.బి ఇన్స్పెక్టర్ .శ్రీనివాస్ గారు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని