యూనిట్

భారీగా గంజాయి దహనం

భారీగా గంజాయి దహనం విశాఖపట్నం జిల్లాలో 455 కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.13 కోట్ల విలువైన 63,879 కిలోల గంజాయిని పోలీసులు కాల్చివేశారు. డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ రేంజ్‌ డి.ఐ.జి ఎల్‌.కే.వి. రంగారావు, జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీల పర్యవేక్షణలో జీవీఎంసీ కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులో దహనం చేసారు. అనంతరం విశాఖ రేంజ్‌ డి.ఐ.జి మాట్లాడుతూ గంజాయి సాగును రూపు మాపడానికి రైతులకు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను సూచిస్తున్నామని తెలిపారు. మావోయిస్టులు డబ్బులకోసమే గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. వారికి ప్రజా సంక్షేమం అవసరం లేదని విమర్శించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ క్రైం కె.ప్రవీణ్‌ కుమార్‌, ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమీషనర్‌ ఎం.భాస్కరరావు, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని