యూనిట్
Flash News
పోలీసుల సమస్యలపై గ్రీవియన్స్ డే
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ పోలీసుల సమస్యలపై గ్రీవియన్స్ డే నిర్వహించారు. ఈ గ్రీవియన్స్ డే కు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల నుండి 25 మంది పోలీసులు హజరయ్యారు. వారి సమస్యలను జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకున్నారు. అటాచ్ మెంట్ లు, ఎపిజిఎల్ఐ గురించి , బదిలీలు, డిప్యూటేషన్లు , మెడికల్ బిల్లులు , రిక్వెస్ట్ బదిలీలు, సస్పెన్షన్స్ సంబంధించిన తదితర మొదలైన విషయాలపై జిల్లా ఎస్పీ గారికి విన్నవించారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి అన్ని సమస్యలను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్బంగా హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓయస్డీ ఆంజనేయులు, ఎ ఓ సురేష్ బాబు, ఆర్ ఐ లు రామకృష్ణ, శివారెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు, పోలీసుసిబ్బంది, హోంగార్డులు ఉన్నారు.