యూనిట్
Flash News
పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి 'గ్రీవెన్స్ సెల్'

విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి జూలై నెల మూడో శుక్రవారం నగర పోలీస్ కమీషనర్ సి.హెచ్. ద్వారకా తిరుమలరావు 'గ్రీవెన్స్ సెల్' నిర్వహించారు. అధికారులు మరియు సిబ్బంది నుండి వినతులు, ఫిర్యాదులు మరియు విజ్ఞప్తులను స్వీకరించారు. మొత్తం 15 దరఖాస్తులు వచ్చాయి. వెంటనే పరిష్కరించగల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, మిగిలిన వాటిని సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసారు.