యూనిట్
Flash News
ప్రతిభావంత విద్యార్థులకు సత్కారం

పశ్చిమగోదావరి జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది పిల్లలు ఇటీవల విడుదలైన పరీక్షల్లో మెరిట్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. నవదీప్ సింగ్ గ్రేవల్ ఆధ్వర్యంలో విద్యార్థులను మెమొంటోలు, మెడల్స్‌తో సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో పిల్లలను ఒత్తిడికి గురి చేయరాదని, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పిల్లల యొక్క ఇష్టానికి అనుగుణంగా తగిన విద్యను అందించాలని, తల్లిదండ్రులు తమ యొక్క ఇష్టాన్ని పిల్లలపై రుద్దడానికి ప్రయత్నం చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.మహేష్ కుమార్, డిఎస్‌పి యు.వి. కష్ణం రాజు, ఆర్.ఐ.లు కె.వెంకటరావు, పి.వెంకట అప్పారావు, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.నాగేశ్వరరావు, సెక్రెటరీ ఎస్.రమేష్ కుమార్, స్టేట్ జాయింట్ సెక్రటరీ నాని, అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.