యూనిట్

ప్రియురాలే హంతకురాలు...

ప్రియురాలే హంతకురాలు... కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో హత్యకు గురైన ఆగిరిపల్లి వీఆర్వో గణేష్‌ హత్య కేసును ఛేదించి నిందితులను ఇరవైనాలుగు గంటల్లోనే అరెస్టు చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఆగరిపల్లి వీఆర్వో అయిన గణేష్‌కు తిరువూరుకు చెందిన కనపర్తి రేణుకు వివాహేతర సంబంధం వుండేది. వారిరువురి మధ్య ఆర్ధిక పరమైన లావాదేవీలు కూడా వున్నాయి. గత ఆరునెలలుగా మృతుడు అనారోగ్యంతో ఉద్యోగానికి సెలవు పెట్టి తన భార్య పిల్లల వద్దనే వుంటున్నాడు. రేణుక ఇంటికి మృతుడు రాకపోవడం, ఫోన్‌ చేసినా సరిగ్గా స్పందించకపోవడంతో గతంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి మృతుడి నుండి కొంత నగదు తీసుకుంది. ఆశించిన నగదు దక్కకపోవడం, తన ఇంటికి రాకపోవడంతో మృతుడిపై ద్వేషం పెంచుకుంది. రేణుక ఎలాగైనా గణేష్‌ను హత్య చేయాలని భావించి, తన తల్లి పులిపాటి కళావతి, తన స్నేహితురాలు చల్లా లక్ష్మి మరియు గతంలో గణేష్‌ కారు డ్రైవర్‌గా పనిచేసిన దేవరపల్లి కాంతారావుతో కలిసి హత్యకు పథక రచన చేసింది. రేణుక, లక్ష్మి, కాంతారావులు స్కార్ఫియో కారులో మృతుడి ఇంటి సమీపంలోకి వెళ్లి మాట్లాడాలని చెప్పి తిరువూరులోని రేణుక ఇంటికి తీసుకువచ్చారు. మృతుడిని భార్య పిల్లలను విడిచిపెట్టి తనతో వుండమని రేణుక బలవంతం చేయగా నేను వుండనని మృతుడు తెగేసి చెప్పడంతో రేణుక, కళావతిలు కత్తి, చాకులతో మృతుడిపై దాడి చేసి చంపేసారు. అనంతరం కిరాయికారులో నలుగురు నిందితులు పారిపోయారు. ఇరవైనాలుగు గంటల్లోనే కారును ఛేదించి నిందితులు నలుగురిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. =

వార్తావాహిని