యూనిట్
Flash News
ఘరానా మోసగాళ్లు అరెస్టు
కార్లను ట్రావెల్స్ నుంచి అద్దెకు తీసుకుని అద్దె చెల్లించకుండా ఇతరులకు తనఖాపెట్టి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు మోసగాళ్లను పట్టుకుని అరెస్టు చేసినట్లు విజయవాడ నగర శాంతిభద్రతల డీసీపీ - 2 చంద్రశేఖర్ తెలిపారు. పాయకాపురానికి చెందిన నక్కారాజా జ్ఞాన సాగర్ మధ్యవర్తిగా వుండి బెజవాడ రాము, పెద్దినేని అనిల్ కుమార్‌లకు నాలుగు కార్లను అద్దెకు ఇచ్చినట్లు వాటిని అద్దె చెల్లించకుండా ఇతరులకు తనఖా పెట్టినట్లు కొత్తపేటకు చెందిన అత్తులూరి సునీల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసినట్లు తెలిపారు. నార్త్ జోన్ ఎసిపి కె.రమేష్ బాబు ఆధ్వర్యంలో నున్న పోలీస్ స్టేషన్ సి.ఐ ప్రభాకర్, ఎస్.ఐ. బి. శ్రీనివాస్‌ల నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ముగ్గురుని అరెస్టు చేశారు. వీరు ముగ్గురు నగరంలో పది కార్లను అద్దెకు తీసుకుని ఇతరులకు తనఖా పెట్టినట్లు తెలిపారు. వారి నుండి పది కార్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.