యూనిట్
Flash News
పోలీస్ ఉద్యోగం నిర్వర్తించడం గత జన్మ అదృష్టం

పోలీస్
ఉద్యోగం నిర్వర్తించడం గత జన్మ అదృష్టం అని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు
అన్నారు. జిల్లాలో పదవీ విరమణ చెందిన ఎస్సై, ఏఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్లుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో
పాల్గొని మాట్లాడారు. సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి
ఆరోగ్యకరంగా పదవీ విరమణ చెందడం అదృష్టంగా బావించాలన్నారు. అనంతరం పదవీ విరమణ
పొందిన ఎస్సై ఉస్మాన్ ఖాన్ పఠాన్, ఏఎస్సై పి.యస్.
రాంబాబు, హెడ్ కానిస్టేబుళ్ళు డికెవియస్‌ఆర్ మోహనరావు,
యమ్. సుబ్రమణ్యం, జె.కె. దుర్గారావు, కానిస్టేబుల్ యన్.ప్రసాద్‌లను పూలమాలలు, శాలువాలతో
సత్క రించారు. కార్యక్రమంలో డిఎస్పీలు విజయరావు, ఉమామహేశ్వర
రావు, మెహబూబ్ భాషా, సి.ఐ వెంకటేశ్వర
రావు, ఆర్.ఐలు నాగిరెడ్డి, కృష్ణంరాజు,
శ్రీనివాస్, జిల్లా పోలీస్ అసోసియేషన్
ప్రెసిడెంట్ పాల్ తదితరులు పాల్గొన్నారు.