యూనిట్

పోలీస్‌ సిబ్బందికి, కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం

పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఒంగోలు లోని పోలీస్‌ కళ్యాణ మండపంలో పోలీస్‌ కుటుంబాలకు, సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యశిబిరంలో కిమ్స్‌ ఆసుపత్రి, అమృత హార్ట్‌ అసుపత్రి వైద్యులు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్‌ బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది, కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకుని జీవితంలో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ కె.వి.వి.ఎన్‌.వి.ప్రసాద్‌, ఏ.ఆర్‌.డిఎస్పీ ఎ.రాఘవేంద్ర రావు, ఎస్బీ సి.ఐ ఎన్‌.శ్రీకాంత్‌బాబు, సి.ఐలు భీమా నాయక్‌, లక్ష్మణ్‌, ఆర్‌.ఐ అంకమ్మ రావు, కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు రామాంజ నేయలు, వేమూరి సురేష్‌,డి.పావని, అమృత హార్ట్‌ హాస్పిటల్‌ వైద్యులు వి.కేశవ, సుధీర్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని