యూనిట్

నాలుగు వేర్వేరు హత్యల కుట్రలు భగ్నం

జిల్లాలో నాలుగు వేర్వేరు హత్యల కుట్రలను బత్తలపల్లి రూరల్‌,తాడిపత్రి రూరల్‌ మరియు కళ్యాణదుర్గం రూరల్‌ పోలీసులు భగ్నం చేసి, తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి నుండీ ఆరు వేట కొడవళ్లు, 15 డిటోనేటర్లు, 15 జెలిటిన్‌ స్టిక్స్‌, 400 గ్రాముల నాటు బాంబుల తయారీ పౌడర్‌, మూడు ఇనుప పైపులు, ఒక మారుతీ 800 కారు స్వాధీనం చేసుకున్నారు. మరి కొంత మంది నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు విలేకరుల సమావేశం నిర్వహించి ఈ నాలుగు హత్యల కుట్రల వివరాలను వెల్లడించారు. బత్తలపల్లి రూరల్‌ పోలీసులు కుట్రను భగ్నం చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు హత్య కుట్రలను భగ్నం చేశారు. మరో కేసులో పరారీలో ఉన్న నిందితుడు సుబ్బరాయుడు మరో వ్యక్తిని చంపడానికి మణికంఠతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు గొట్టిరమణయ్యను అదుపులోనికి తీసుకుని విచారిస్తే విషయం బయట పడింది. మాజీ ఆర్వోసీ నాయుడు రామకృష్ణను చంపడానికి పథకం వేసిన ముఠాను పోలీసుల భగ్నం చేశారు. నాలుగు వేర్వేరు హత్య కుట్రలను భగ్నం చేసిన తాడిపత్రి రూరల్‌, ధర్మవరం రూరల్‌ పోలీసులను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ప్రశంసించారు.

వార్తావాహిని