యూనిట్
Flash News
ప్రజాశ్రేయస్సు కోసమే ప్రాణాలర్పించారు

పోలీసులు
ప్రజా శ్రేయస్సు కోసమే ప్రాణాలర్పిస్తారని కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప
అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభించన సందర్భముగా ఆయన
మాట్లాడారు. పోలీసులు, జవాన్లు
దేశరక్షణ కోసం ప్రాణాలర్పిస్తున్నారు, వారి సంస్మరణార్ధం
ఈ వారోత్సవాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ఆయుధాల ప్రధర్శన,
వ్యాసరచన పోటీలు, నిర్వహించారు.
కార్యక్రమంలో ఓ.ఎస్.డి ఆంజనేయులు, ఏ.ఆర్.అదనపు ఎస్పీ
రాధాకృష్ణ, సి.ఐలు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.