యూనిట్

విజయవంతంగా ముగిసిన మొదటి బ్యాచ్ గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల శిక్షణ

నెల్లూరు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం, చెముడుగుంట నందు మొదటి బ్యాచ్ గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల 2 వారాల శిక్షణ కార్యక్రమం శనివారం తో  ముగిసినది.  ముగింపు సందర్భముగా  యస్.పి.   భాస్కర్ భూషణ్,   శిక్షణార్ధులకు పోలీస్ సెట్ కాన్ఫరెన్స్ గురించి లైవ్ లో అవగాహన కల్పించారు.   జిల్లా యస్.పి.   ప్రతి రోజూ ఉదయం డైలీ సిచువేషన్ రిపోర్ట్ ను VHF సెట్ ద్వారా ఏవిధంగా రివ్యూ నిర్వహించేది, అధికారులతో కాల్ సైన్ ఉపయోగించి ఏవిధంగా సంభాషించి జావా, లోటస్, టాంగో మరియు ట్రాఫిక్ విభాగాలు ఏ విధంగా సమన్వయంతో పనిచేస్తాయో మొదలగు అంశాలు వివరించారు.

ఈ సందర్భంగా యస్.పి.  మాట్లాడుతూ రాబోయే రోజులలో కార్యదర్శులు అందరికి నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు.  సమాజంలో నిస్సహాయులుగా ఉండే విభాగాలపై ముఖ్యంగా దృష్టి పెట్టాలని సూచించారు.  మహిళలు, వృద్దులు మరియు బాలలకు రక్షణ మరియు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షల మేరకు మెరుగైన సేవలందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.  జిల్లాలో అధికారులు అందరూ మీతో పాటు సమానంగా కలిసి పనిచేయనున్నారని, అందుకు తగ్గట్లుగా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  డి టి సి  ప్రిన్సిపల్   పి. మనోహర్ రావు, వైస్ ప్రిన్సిపల్   రవీంద్ర రెడ్డి,ఐ సి డి ఎస్ పి డి  శ్రీమతి సుధాభారతి,  ఏ పి డి  శ్రీమతి శేషకుమారి,  సి డి పి ఓ  శ్రీమతి ఉదయలక్ష్మి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్   బి.సురేష్, రిజర్వు ఇన్ స్పెక్టర్    సురేష్ మరియు శిక్షణా సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని