యూనిట్

హోంగార్డు కుటుంబాలకు ఆర్ధిక సహాయం

విజయవాడ నగరంలో పనిచేసే హోంగార్డులు వారి ఒకరోజు వేతనాన్ని ఉద్యోగ విరమణ చెందిన లేక మరణించిన హోంగార్డు కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇటీవల పదవీ విరమణ చెందిన మరియు మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలకు నగర పోలీస్‌ కమీషనర్‌ ద్వారకా తిరుమల రావు చెక్కులను పంపిణీ చేశారు. మృతి చెందిన హోంగార్డు గంటా రామతులశమ్మ (డబ్యూ.హెచ్‌.జి - 631) మరియు ఉద్యోగ విరమణ చెందిన బొల్లా దుర్గా నాగప్రసాద్‌ (హెచ్‌.జి.341) కుటుంబాలకు చెరో నాలుగు లక్షల రూపాయల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో నగర సంయుక్త పోలీస్‌ కమీషనర్‌ నాగేంద్ర కుమార్‌, అడ్మిన్‌ డిసిపి కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని